గోవిందుడికి అన్యమత అపచారం… భక్తుల ఆగ్రహం

గోవింద నామాలతో గోవింద నామస్మరణలతో మార్మోగాల్సిన ప్రదేశంలో అన్యమత పదం వినిపిస్తే అపచారం కదూ..

వెంకటేశ్వరుని చరిత్రను వెంకటేశ్వరుని ప్రతిష్టను ఇనుమడింపజేసే పుస్తకాల్లో వెబ్సైట్లను అన్యమత అక్షరాలు కనిపిస్తే దీన్ని ఏమనాలి బరితెగింపు అనాలా? తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల నిర్లక్ష్యమా?

వెంకటేశ్వర స్వామి ముందు “శ్రీ యేసయ్య” అనే పదాన్ని చేర్చి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్ సైట్ లోనే ప్రచురించడం శ్రీవారి మనోభావాల్ని దెబ్బ తీసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఒకవైపు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులు ఎవరు పని చేయడానికి వీలులేదని ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల చేసింది.

2019 20 నాటి పంచాంగాన్ని విడుదల చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం తమ అధికారిక వెబ్సైట్లో ఒక పోస్ట్ చేసింది. ఆ పంచాంగము పిడిఎఫ్ రూపంలో ఉంది.

ఏప్రిల్ 6, 2019న ఈ ఈ పోస్ట్ పెట్టారు అయితే ఈ పోస్టుకు ఇస్తున్న డిస్క్రిప్షన్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి అనే పేరు ముందు “శ్రీ యేసయ్య” అని రాసి ఉండడం గమనార్హం.

దీనిని గమనించిన శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్యమత ప్రచారానికే ఆ పోస్టు పెట్టారా?ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తి ఎవరు?

కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా టీటీడీ అధికారిక వెబ్సైట్ లో అన్యమత ప్రచారం కనిపించింది.

ఇంత బరితెగింపు రావడానికి కారణం ఎవరు వెబ్ సైట్ ను నిర్వహిస్తున్న టిటిడి అధికారులు ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పట్టించుకోని టీటీడీ అధికారులు, రాజకీయ ఒతుళ్ళకు తలొగ్గి అన్యమత ప్రచారాలు ప్రోత్సహిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందు సంఘాలు, శ్రీవారి భక్తులు

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*