
తిరుమల స్వామి దర్శనం జయ,విజయుల నుంచే లభించడమే మహాభాగ్యం అనుకునే భక్తులు కొకొల్లలు. అయితే ఏకంగా భక్తులు గర్భగుడిలోకే అడుగు పెట్టే వారా ?. అంటే ఆశ్చర్యం కలుగుతుంది కదూ.
కానీ, చరిత్రను ఆధారంగా చూసుకుంటే గర్భగుడిలోకి వెళ్ళే వారని అర్థమవుతోంది. నేరుగా లోనికి వెళ్ళి కొలిచేవారని తెలుస్తోంది. ఇందుకు కులశేఖర ఆళ్వార్ ఉదంతమే సాక్ష్యంగా నిలుస్తుంది.
కులశేఖర ఆళ్వార్ కేరళ ప్రాంతానికి చెందిన తిరువాన్కూరు రాజ్యానికి మహారాజు కులశేఖరుడు. ఆలత మహా విష్ణుభక్తుడు. 12మంది వైష్ణవ మహాభక్తులు ఆళ్వారులలో ఆయన కూడా ఒకరు.
తిరుమలకు వచ్చి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే వారు. క్రీ.శ. 7వ శతాబ్దంలో ముకుందమాల అనే గ్రంథాన్ని రచించి భగవంతునికి అంకితం చేశారు. ఆయన ఎంతటి భక్తుడంటే ఇందుకు కొలమానం లేదనిపిస్తుంది.
ఆయన స్వామిని ఓ కోరిక కోరుకున్నారట. ఆ గ్రంథంలో ఆ మాట ఉంది. తిరుమల దేవునితో ఇలా అన్నారట. ‘స్వామీ… నీ సన్నిధికి దేవతలు, అప్సరసలు, మహాభక్తులు, నడిచి వచ్చేవారు ఎందరో ఉన్నారు.’
‘అటువంటి వారు నీ సన్నిధిలో గడపదాటి వచ్చి నిన్ను సేవిస్తారు. గడప దాటి వచ్చే ఆ భక్తుల పాదదూళి తాకినా చాలు నా జన్మ తరించినట్టే. నేనో సామన్య భక్తుడను. నన్ను నీ ముంగిట గడప ఉండేలా అనుగ్రహించమ’ని కోరుకున్నారట.
వేంకటేశ్వర స్వామి అనుగ్రహించారట. అదే నేటి కులశేఖరుడి. అంటే గర్భాలయానికి ఉన్న పెద్ద గడప. దీనిని బట్టి మనకు అర్థమయ్యింది ఏమిటంటే భక్తులు నేరుగా ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేసేవారని అర్థమవుతుంది.
Leave a Reply