తిరుమలలో ఏ ఆలయాలు దర్శించుకోవాలి? ఏమేమి చూడాలి?

చాలా మంది తిరుమలకు రావడం ఆలస్యం స్వామి దర్శనం చేసుకునే తొందరలోనే ఉంటారు. అసలు తిరుమల ఆలయం చుట్టూనే ఏమేమి ఉన్నాయి. వేటిని చూడాలి? ఏ ఆలయాన్ని దర్శించుకోవాలి.

ప్రపంచ వ్యాప్తంగా తిరుమల దర్శనం కోసం ఆరాటపడే భక్తులు చాలా మంది ఉన్నారు. రోజూ కనీసం లక్షమంది భక్తులు కొండకు వచ్చి వెళ్లుతుంటారు.

ఎంత త్వరగా తిరుమల చేరుతారో అంతే త్వరగా తిరుగు ప్రయాణం కావాలని అనుకుంటారు.

కానీ, తిరుమలలో చూడాల్సిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి. వాటిలో ఆలయాలు ఏవి? చూడదగిన ప్రదేశాలు ఏమిటి? అనే ఆలోచన చాలా మందిలో కలుగదు.

అందుకు కారణం తిరుమల యాత్రే హడావుడిగా ప్రణాళిక చేసుకోవడం.

తిరుమల ఆలయంతో ముడిపడి ఉన్న ఆలయాలు తిరుమలలోనే ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది వరాహస్వామి ఆలయం.

అసలు తిరుమలలో వేంకటేశ్వర స్వామికి కాస్తంత చోటిచ్చేందే వరాహస్వామి అని పురాణాలు చెబుతున్నాయి.

తన దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు వరాహస్వామిని దర్శించుకున్న తరువాతే తన దర్శనానికి వచ్చేలా చేస్తానని వేంకటేశ్వర స్వామి హామీ ఇచ్చారట.

అప్పటి నుంచే అదే సాంప్రదాయంగా కొనసాగుతోంది. కాబట్టి వరాహస్వామి ఆలయాన్ని దర్శించుకోవాలి. ఈ ఆలయం తూర్పు ఉత్తర మాడ వీధులు కలిసే చోట ఈశాన్యంలో ఉంటుంది.

స్వామి పుష్కరిణి చాలా ముఖ్యమైనది. ఇక్కడ స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయట. ఇక్కడ స్నానమాచరించిన తరువాత స్వామిని దర్శించుకోవాలని ఉంది.

ఇక్కడ స్నానమాచరిస్తే మంచిది. టీటీడీ శుభ్రతను పాటిస్తోంది.

ఇక బేడి ఆంజనేయ స్వామి ఆలయం : ఎక్కడ శ్రీనివాసుడు ఉంటాడో అక్కడ ఆయన భక్త కోటి ఉండడం సహజం. త్రేతాయుగంలో రాముడి అవతారంలో ఉన్న శ్రీనివాసుడికి ఉన్న అనుబంధం మనకు తెలిసిందే.

అదే అనుబంధం కలియుగంలో కూడా కొనసాగుతోంది. బేడి ఆంజనేయస్వామి వారి దేవాలయం శ్రీవారి సన్నిధికి తూర్పు మాడా వీధిలో మహాద్వారానికి అఖిలాండానికి ఎదురుగా ఉంటుంది.

బేడి ఆంజనేయస్వామి రెండు చేతులు అంజలి ఘటించి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి నమస్కరిస్తూ నిలబడి ఉంటాడు.

చిన్నతనంలో తిరుమల వదిలి పారిపోతుంటే, ఆంజినేయుడి తల్లి అంజలీ దేవి ఆయన చేతులకు బేడీలు తగిలించిందట అందుకనే ఈయనను బేడీ ఆంజనేయస్వామి అంటారు. ఈయన విగ్రహం చేతులకు బేడీలు తగిలించి వుంటుంది. స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఇక భక్తి పరంగా ఇలా ఉంటే తిరుమల చరిత్రను తెలిపే మ్యూజియం ప్రధానంగా చూడదగిన ప్రదేశం. వేంకటేశ్వర స్వామికి వినియోగించిన వస్తువులు, చరిత్రను భద్రపరుస్తూ తిరుమల తిరుపతి దేవస్ధానం ఏర్పాటు చేసింది. దీనిని చూడవచ్చు.

హథీరాంజీ మఠం : శ్రీవేంకటేశ్వర స్వామి చరిత్రలో హథీరాంజీ మఠానికి చాలా ప్రాముఖ్యత ఉంది. హథీరాంజీ నేరుగా వేంకటేశ్వర స్వామితో పాచికలు ఆడారట.

వేంకటేశ్వర స్వామి ఆలయ ఆస్తుల పరిరక్షణలో హథీరాంజీ మఠం ప్రముఖ పాత్ర పోషింది. ఇది స్వామి ఆలయానికి సమీపంలో ఉంటుంది.

తిరుమలలోనే సహజ శిలా తోరణం ప్రసిద్ధి చెందినది ఇక్కడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పార్కులను ఏర్పాటు చేసింది.

ఇంకా తిరుమలలో పాపనాశనం, ఆకాశగంగ, ధర్మగిరి, శ్రీవారి పాదాలు, జాపాలి ఇలా ఎన్నో ఆలయాలు తీర్థాలు ఉన్నాయి వాటి ప్రాముఖ్యతను మరో సందర్భంలో తెలుసుకుందాం.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*