తిరుచానూరులో బంగారు గొడుగు ఉత్స‌వం

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్ర‌వారం సాయంత్రం బంగారు గొడుగు ఉత్స‌వం జ‌రిగింది.

పంతులుగారి ప్రస్తుత వంశీకుడైన శ్రీ రామనాథన్‌ ఆధ్వర్యంలో కల్యాణకట్ట క్షురకులు, సిబ్బంది ఈ బంగారు గొడుగును ర‌థానికి అలంక‌రించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ఈ గొడుగును ఆల‌య ప్ర‌ద‌క్షిణ‌గా తీసుకొచ్చి ర‌థానికి అమ‌ర్చి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. శ‌నివారం ఉదయం 7.55 గంటలకు అమ్మవారి రథోత్సవం వైభవంగా జరుగనుంది.

పంతులుగారి వంశీయుల ఆధ్వ‌ర్యంలో తిరుమ‌లతోపాటు తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీ కోదండ‌రామాల‌య బ్ర‌హ్మోత్స‌వాల్లో ర‌థోత్స‌వం ముందురోజున బంగారు గొడుగు ఉత్స‌వం నిర్వ‌హిస్తున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో క‌ల్యాణ‌క‌ట్ట డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి నాగ‌ర‌త్న, శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌య ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*