వ‌స్తురూపేణ విరాళాలందించే దాత‌ల కోసం ప్ర‌త్యేక అప్లికేష‌న్

తిరుమల తిరుపతి దేవస్థానానికి వ‌స్తువుల రూపంలో విరాళాలందించే దాత‌ల సౌక‌ర్యార్థం ప్రత్యేకమైన అప్లికేషన్ రూపొందించాలని టిటిడి నిర్ణయించింది.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ నిర్వహించిన సమీక్షలో కైండ్ డొనేష‌న్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ పేరిట ప్ర‌త్యేక అప్లికేష‌న్ రూపొందించాల‌ని ఐటి అధికారుల‌ను ఆదేశించారు.

తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల కార్యాల‌యంలో గురువారం ఐటి అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ బియ్యం, చ‌క్కెర‌, బెల్లం త‌దిత‌ర వంట స‌రుకుల‌తోపాటు ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు, ఇత‌ర వ‌స్తువుల‌ను విరాళంగా అందించే దాత‌ల వివ‌రాల‌ను ఇప్ప‌టివ‌ర‌కు రిజిస్ట‌ర్ల‌లో న‌మోదు చేస్తున్నార‌న్నారు.

అయితే కంప్యూట‌ర్ అప్లికేష‌న్ రూపొందించి దాత‌ల‌కు త‌గిన ప్ర‌యోజ‌నాల‌ను వ‌ర్తింప‌చేయాల‌ని సూచించారు. త‌క్కువ మొత్తంలో ఉన్న బిల్లుల‌ను కూడా ఇ-ఆఫీస్ ద్వారా పంపి కాగితం వాడ‌కాన్ని త‌గ్గించాల‌న్నారు.

వివిధ విభాగాల అధికారుల‌కు ఉప‌యుక్తంగా ఉండేలా టిటిడి వెబ్‌సైట్లో డ్యాష్ బోర్డును రూపొందించాల‌ని ఆదేశించారు.

శ్రీ‌వారిసేవకులకు లాక‌ర్ల కేటాయింపు, విభాగాల వారీగా సేవ కేటాయింపు కోసం నూత‌నంగా రూపొందిస్తున్న అప్లికేష‌న్‌పై స‌మీక్షించారు.

గోవింద మొబైల్ యాప్‌ను ఒక నెల‌లోపు మ‌రింత మెరుగ్గా భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురావాలి ఈవో సూచించారు.

అదేవిధంగా, ఆన్‌లైన్ అడ్మిష‌న్, డిజిట‌ల్ పిఆర్ మేనేజ్‌మెంట్‌, లీజ్ మ‌రియు రెంట‌ల్ మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్ ఎస్టిమేట్స్‌, వెహిక‌ల్/గూడ్స్ ప‌ర్మిట్‌, విజిలెన్స్ కంప్లైంట్ అండ్ ట్రాకింగ్‌, కోర్టు కేసెస్‌, హెచ్ఆర్ మ్యాప్స్‌, ఇ-పేమెంట్ త‌దిత‌ర అప్లికేష‌న్ల‌పై ఈవో స‌మీక్షించారు.

ఈ స‌మావేశంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, ఐటి విభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*