స్నపన తిరుమంజనంలో ఏం వాడుతారు?

ఖర్జూరం, బాదం పండ్లు, మొక్కజొన్న, నందివర్ధనం మాలలతో శోభాయమానంగా స్న‌ప‌న‌తిరుమంజ‌నం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన గురువారం ఖర్జూరం, బాదం పండ్లు, మొక్కజొన్న, నందివర్ధనం తదితర మాల‌ల‌తో అమ్మవారికి స్నపనతిరుమంజనం శోభాయమానంగా జరిగింది.

మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో శ్రీపాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక నిర్వ‌హించారు.

కంకణభట్టర్‌ శ్రీ వేంప‌ల్లి శ్రీ‌నివాసులు ఆధ్వర్యంలో ఈ విశేష కార్య‌క్ర‌మం జరిగింది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు.

  • అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం (పసుపు), గంధోధకం (గంధం)తో స్నపనం నిర్వహించారు.

శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను పాంచరాత్ర ఆగమయుక్తంగా నిర్వహించారు.

ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఎనిమిది రకాల మాలలను అమ్మవారికి అలంకరించారు.

ఇందులో ఖర్జూరం, బాదం పండ్లు, మొక్కజొన్న, వట్టివేరు, నందివర్ధనం, అనపగింజలు, ఆకుపచ్చ చామంతి, తుల‌సి మాల‌ల‌ను అమ్మవారికి అలంకరించారు.

మ‌ధ్య‌లో ప‌లుర‌కాల ఫ‌లాల‌ను నివేదించారు. టిటిడి ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాసులు ఆధ్వ‌ర్యంలో మాల‌ల‌ను రూపొందించారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*