తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం రాత్రి గరుడసేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి పాదాల ఊరేగింపు వైభవంగా జరిగింది.
తిరుమల శ్రీవారి ఆలయం నుండి స్వామివారి స్వర్ణపాదాలను మొదట తిరుచానూరులోని పసుపుమండపం వద్దకు తీసుకువచ్చారు.
అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.
అమ్మవారి గరుడసేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదాలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. గరుడసేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు.
అదే గరుడసేవ తిరుచానూరులో అమ్మవారికి జరుగుతున్నపుడు శ్రీవారు తనకు గుర్తుగా పాదాలను పంపుతున్నాడని పురాణాల ఐతిహ్యం.
Leave a Reply