సుమంగళీ ద్రవ్యాలు అంటే ఏమిటి? వాటిని తిరుచానూరులో ఇస్తారా?

పెళ్లయిన వారిని సుమంగళీ భవ అని దీవిస్తుంటారు. నిండు నూరేళ్ళు నిండుముత్తయిదువులా జీవించు అని అర్థం. మరి ఈ సుమంగళి ద్రవ్యాలు అంటే ఏంటి? వాటిని తిరుచానూరులో ఇస్తరా? ఏమిటా కథ ఎందుకు ఇస్తారు? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

జగదేకమాత శ్రీమహాలక్ష్మీ అవతారమైన పద్మావతీ అమ్మవారు అందరికన్నా పెద్ద ముత్తయిదువ. పసుపు, కుంకుమ, కాటుక, గాజులు, కమ్మలను సుమంగళీ ద్రవ్యాలుగా పెద్దలు చెబుతారు. వీటిని ధరించి వచ్చే వివాహిత మహిళను నిండు ముత్తయిదువ అంటారు. ఆమెకు పెళ్ళిపేరాంటాళ్ళలు అగ్ర స్థానం ఉంటుంది. సుమంగళీకి మన ఆచారాలలో కల్పించిన స్థానం అది.

అయితే, ఆధునిక స‌మాజంలో ప‌సుపు, కుంకుమ‌ల విలువ‌ను, చివరకు తాళిబొట్టును మ‌రిచిపోతున్న కొందరు యువ‌తుల‌కు వాటి ప్రాధాన్యాన్ని తెలియ‌జేసేందుకు టిటిడి హిందూ ధ‌ర్మప్ర‌చార ప‌రిష‌త్ ‘సౌభాగ్యం’ కార్య‌క్ర‌మాన్ని రూపొందించింది.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా సౌభాగ్యం కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రుగుతోంది. ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 3 నుండి 5 గంట‌ల వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు గాజులు, కుంకుమ అందిస్తున్నారు. బ్ర‌హ్మోత్స‌వాల‌ తొమ్మిది రోజుల్లో 2 ల‌క్ష‌ల గాజులు అందిస్తారు.

టిటిడి హిందూ ధ‌ర్మప్ర‌చార ప‌రిష‌త్ 2012వ సంవ‌త్స‌రంలో సౌభాగ్యం కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. అప్ప‌టినుండి ప్ర‌తి ఏడాదీ అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు, వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంది.

తిరుచానూరులో ప్రకాశిస్తున్న శ్రీ పద్మావతి అమ్మవారు సకల సౌభాగ్యాలను ప్రసాదించే శ్రీమహాలక్ష్మీదేవి. స్వామివారు జగద్భర్త కాగా అమ్మ‌వారు లోకమాత. జగత్తు అంతా వారి కుటుంబమే. లోకంలో సిరిసంపదలు, విద్య, పదవి, జ్ఞానం చివరికి మోక్షం కూడా అమ్మవారి స్వరూపాలే అని శాస్త్రాలు వివరిస్తున్నాయి.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*