నేడు లక్మీకాసుల హారం ఊరేగింపు.. ఎవరిదీ హారం?

పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా అరుదైన, దివ్యమైన ఆభరణం అటు తిరుమలలో, ఇటు తిరుచానూరులో ఒకే రోజు ఊరేగింపు చేస్తారు. అసలు ఆ హారం  ఎవరిది? ఎందుకు ఊరేగిస్తారు?

ఆ హారం పేరు లక్ష్మీ కాసుల హారం.  దాని వెలకట్టడం ఎవరి తరమూ కాదు. ఎందుకంటే ఆ హారానికి అంతటి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంది మరి. స్వయానా ఆ తిరుమల వేంకటేశ్వరుడే ఆ కాసుల హారాన్ని తన దేవేరికి పంపుతారు.

తన హృదయవాసి ఉత్సవాల్లో తను ధరించడానికి పంపే హారం. ఆ హారం అట్లాంటి ఇట్లాంటి హారం కాదు. సాక్షాాత్తు తిరుమల వేంకటేశ్వరుడి అలంకారానికి వినియోగించే లక్ష్మీ కాసుల హారం.

తిరుచానూరు అలిమేల్ మంగ బ్రహ్మోత్సవాలలో అమ్మవారికి ధరింపజేయడానికి  ఆభరణాలలో అత్యంత ప్రధానమైన లక్మీకాసుల హారాన్ని తిరుమల నుంచి పంపడం ఆనవాయితీ.  నేటి ఉద‌యం 8.00 నుండి 9.00 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల‌లోని ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగిస్తారు.

అనంత‌రం ఈ హారంను అధికారులు ఉదయం 9 గంటలకు తిరుమలలో బయల్దేరి, తిరుచానూరులోని పసుపు మండపానికి  తీసుకొస్తారు. అనంతరం ప‌సుపు మండ‌పం నుంచి మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటల మధ్య శోభాయాత్రగా అమ్మవారి ఆలయానికి తీసుకెళతారు.

        న‌వంబ‌రు 27వ తేదీ అంటే నేటి సాయంత్రం జరిగే గజ వాహనసేవలో అమ్మవారికి ఈ లక్ష్మీకాసుల హారాన్ని అలంకరిస్తారు. శ్రీవారి కాసులహారాన్ని ప్రతి ఏటా గజవాహన సేవ రోజు అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*