శ్రీవారి దేవేరి అలిమేలు మంగ విశ్రాంతి తీసుకునే మండపమేది?

అలిమేలు మంగాపురం పద్మావతీ అమ్మవారు అక్కడే సేదదీరుతారు. అక్కడే నైవేద్యం స్వీకరిస్తారు. బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే అక్కడ బస చేస్తారు. ఇంతకీ ఆ మండపం యొక్క చరిత్ర ఏంటి? ఆ మండపాన్ని ఎవరు కట్టించారు. వివరాలు తెలుసుకోవడానికి మనం దిగువనున్న వివరాలు చదవాల్సిందే.

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వాహనసేవల్లో అలిమేలు మంగమ్మ విశ్రాంతి, నైవేద్యానికి ఆవాసం చేసే ప్రదేశం గంగుండ్ర మండపం. ఈ మండపానికి దాదాపు 151 సంవత్సరాల పురాతనమైన చరిత్ర వుంది.

తిరుచానూరులోని పద్మావతీ (అలిమేలు మంగ) అమ్మవారి ఆలయానికి ప్రక్కన, పద్మసరోవరా(పుష్కరిణి)నికి ఎదురుగా ఉన్న గంగుండ్ర మండపాన్ని 1868వ సంవత్సరంలో ఎస్‌.వెంకటరంగ అయ్యంగార్‌ నిర్మించారు.

ఆయన బ్రిటిష్‌ ప్రభుత్వంలో తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాలలో తహశీల్ధార్‌గా పని చేశారు. అమ్మవారిపై ఆయనకు అచెంచల భక్తి.

అమ్మవారు ఊరేగింపునకు బయలుదేరిన తరువాత, నైవేద్యం పెట్టాలన్నా, అమ్మవారు విశ్రాంతి తీసుకోవాలన్నా ఓ ప్రదేశం ఉండేది కాదు. దీంతో వెంకటరంగ అయ్యంగార్ ఈ ఆలయాన్ని నిర్మించారు.

ఆ నాటి నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని నేరుగా గంగుండ్రు మండపానికి తీసుకువచ్చి అక్కడే అలంకార తుది మెరుగులు దిద్ది పూజలు చేసి, ఊరేగింపునకు బయదేరదీస్తారు. ఆనాటి నుండి నేటి వరకు ఆయన వంశస్థులు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో, తెప్పోత్పవాల్లో తిరుచానూరు విచ్చేసి అమ్మవారిని సేవిస్తున్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*