అమ్మో అంత పెద్ద హారమా..? ఎప్పుడైనా చూసారా? ఫోటో గ్యాలరీ

నిలువెత్తు హారము బహుశా మీరు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండకపోవచ్చు. ఆహారాన్ని తిలకించే అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పించింది. తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు సందర్భంగా లక్ష్మీ కాసుల హారాన్ని తిరుమల లో ఊరేగించింంది

తిరుమల శ్రీవారి ఆల‌య మాడ వీధుల్లో బుధ‌వారం ఉద‌యం లక్ష్మీ కాసులహారం ఊరేగింపు ఘ‌నంగా జ‌రిగింది. ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ఈ హారాన్ని ఊరేగించారు.

అనంత‌రం తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి అలంక‌రించేందుకు తీసుకెళ్లారు. తిరుచానూరులోని ప‌సుపు మండ‌పం వ‌ద్ద ఆల‌య అధికారుల‌కు అప్ప‌గించారు.

అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా బుధ‌వారం గజవాహనం, గురువారం గరుడవాహన సేవల్లో శ్రీ పద్మావతి అమ్మవారికి ల‌క్ష్మీ కాసుల‌హారాన్ని అలంక‌రిస్తారు.

మాడ వీధుల్లో జ‌రిగిన ఊరేగింపులో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, పేష్కార్ శ్రీ లోక‌నాథం త‌దిత‌రులు పాల్గొన్నారు

[rl_gallery id=”1265″]

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*