ఏ అంతరిక్ష ప్రయోగమైనా… స్వామి ఆశీస్సులతోనే… !

భారత దేశం అంతరిక్ష ప్రయోగాలలో దూసుకుపోతోంది. ప్రపంచ దేశాలను నోరెళ్ళబెట్టేలా చేస్తోంది. ఇంతటి ఘనత సాధించినా ఇస్రో అధికారులు మాత్రం తాము చేయబోయే ప్రయోగం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. రేపు జరగబోయే అంతరిక్ష ప్రయోగానికి ముందు కూడా ఇదే జరిగింది. ఇస్రో ఛైర్మన్ శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

సోమవారం రాత్రి తిరుమలకు వచ్చిన ఆయన మంగళవారం ఉదయాస్తమాన విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తాము చేయబోతున్న ప్రయోగాన్ని విజయవంతం చేయాలని కోరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శివన్ కు దగ్గరుండి దర్శనం చేయించి రంగనాయకమండపంలో వేదమంత్రోచ్ఛరణల నడుమ ఆయన తీర్థప్రసాదాలను అందజేశారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*