దేవుడంటే ఎవరు ? ఏ లక్షణాలుంటాయ్ ?

‘ అయ్యా మీరు మా పాలిట దేవుడయ్యా..! భగవంతుడిలా మా కోసమే వచ్చారయ్యా.. ’ అంటూ ఆదుకున్న వారిని కొనియాడుతుంటాం. ఇంతకీ ఎవరీ భగవంతుడు? ఆ దేవుడు ఎలా ఉంటాడు.?

మన వేదాలు.. పురాణాలు ఏమి వివరిస్తున్నాయి? తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం దిగువనున్న సారాంశం చదివేయండి.

దేవుడు, దేవుడు అనే పదం ప్రతి నోట పలకడమే తప్ప దేవుడికి ఏ లక్షణాలుంటాయి దాని అర్థం ఏంటి అంటే మాత్రం మనలో చాలా మందిమి ఏం చెప్పలేం. దేవుడంటే దేవుడే అనే సమాధానం చాలా మంది నోటి నుంచి వినబడుతుంది. కానీ, ఆ భగవంతుడనే పదానికి అర్థం నిర్వచించబడింది.

ఇది భగవత్ ‘ ఐశ్యర్యస్య సమగ్రస్య వీరస్య యశస శ్ర్శియ:, జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరాణా’ అనగా సమగ్రములైన నియామకత్వము, పరాక్రమము (నిర్వికారత్వమని కొందరు), కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము ఈ ఆరింటికి ‘భగ’ మని పేరు. ఈ ఆరు గుణములను కలిగిన వానిని భగవంతుడని అంటారని మన వేదాలు, పురాణాలు చెబుతున్నాయి.

భగవత్ అనే పద ప్రయోగ సందర్భంలో ఈ అర్థాన్ని అనుసంధానించుకోవాల్సి ఉంటుందట. భగవంతుడు, షడ్గుణ పరిపూర్ణుడు, షాడ్గుణ్య పరిపూర్ణుడు అనే పర్యాయపదాలతో పిలస్తుంటారు. అందుకే షడ్గుణాభిరామ… అని రాముడిని కొనియాడుతారు. ఒక్క రాముడే కాదు, ఈ ఆరు గుణాలను కలిగిన ఎవ్వరైనా భగవంతుడే… ఆ భగవంతుడనే పదమే సరళ భాషలో దేవుడుగా మారింది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*