మాస శివరాత్రి ఎలా జరుపుకోవాలి? ఎందుకు జరుపుకోవాలి?

మాస శివరాత్రి ఎలా జరుపుకోవాలి? ఎందుకు జరుపుకోవాలి?హిందూ ధర్మంలో శివరాత్రి అనే పదం తెలియని వారు ఉండరు. ప్రాముఖ్యత కూడా అదే స్థాయిలో ఉంటుంది. మరి మాస శివరాత్రి అంటే ఏంటి మాసశివరాత్రి ని ఎప్పుడు జరుపుకోవాలి? ఎలా జరుపుకోవాలి? అసలు మాస శివరాత్రి అంటే ఏంటి?

ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిధిని మాసశివరాత్రిగా అని అంటారు. శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. ఆ తిధిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి

మహాశివుడు లయ కారకుడు. కనీనికా నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము లయానికి అంటే మృత్యువునకు కారకుడు కేతువు, అమావాస్య ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు.

చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండంతో వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము పడి జీర్ణ శక్తి తగ్గుతుంది. తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది.

ఈ సమయంలో మానసికముగా సమయమును కోల్పోవడమో, చంచల స్వభావులుగా మారడమో, మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరుగుతుంది.

తమ సమీపములో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణము లకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించ్చని చెప్పవచ్చు.

ఆ తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది.

ఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చెయ్యాలి.

అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 5/11/18/21/56/108 ఇలా ప్రదక్షణములు చేయవచ్చు. శివాలయములో పూజలో ఉంచిన చెరకు రసమును భక్తులకు పంచినచో ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది.

అలాగే ఆరోజు ప్రదోష వేల శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది.

మూడు పూటలా చల్లటి నీటితో వీలు అయినంత ఎక్కువ సమయం స్నానం చెయ్యాలి. మంచం మీద కాకుండా నేలపై పవళించాలి.

ప్రత్యేకించి ఈ రోజు ను సశాస్త్రీయంగా జరుపుకోవడము వలన దోష తీవ్రత తగ్గుతుంది.సంతానలేమి సమస్యలు నుండి విముక్తి లభిస్తుంది.

దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవడము ద్వారా శుభములను పొందవచ్చు

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*