శ్రీవారి ఆలయాన్ని చుట్టేయాలని ఉందా….!

తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాకారాలను చాసే  స్థితి ఉండదు. ఇష్టదైవం ఆలయంలో అనువనువు చూడాలని అనిపిస్తుంది. ఆ కోరిక తీరాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

శ్రీ‌వారి ఆల‌యాన్ని ప్ర‌త్య‌క్షంగా ద‌ర్శించిన అనుభూతి పొందేలా వ‌ర్చువ‌ల్ రియాలిటి 3డి ఆగుమెంటేష‌న్ టెక్నాల‌జీతో మ్యూజియంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది.

  ప్ర‌తిపాదిత మ్యూజియం అభివృద్ధికి జోన్‌-1, జోన్‌-2, జోన్‌-3, జోన్‌-4, జోన్‌-5, జోన్‌-6గా విభ‌జించారు.

       ఇందులో జోన్‌-1లో  గొల్ల‌మండ‌పం, మ‌హ‌ద్వారం, తులాభారం, రంగ‌నాయ‌కుల మండ‌పం, ధ్వ‌జ‌స్తంభం, వెండివాకిలి, ఆల‌య పైక‌ప్పు, స్తంభాలు, వాటిపై ఉన్న శిల్పా సౌంద‌ర్యం,

జోన్‌-2లో ఆల‌య నాలుగు మాడ వీధులు, పుష్క‌రిణి, ఆల‌య‌ ప‌రిస‌రాలు త‌దిత‌ర వాటితో రూపొందిస్తున్నారు.

జోన్ -3లో బంగారు వాకిలి, గ‌రుడాళ్వార్‌, గ‌ర్భాల‌యం, వ‌కుళామాత స‌న్నిధి, యాగ‌శాల‌, విమాన వేంక‌టేశ్వ‌ర‌స్వామి, స‌బేరా, భాష్య‌కార్లు, శ్రీ యోగ‌న‌ర‌సింహ‌స్వామి, శ్రీ వ‌ర‌ద‌రాజ‌స్వామి, పోటు, క‌ల్యాణ‌మండ‌పం త‌దిత‌ర ప్ర‌దేశాల‌ను వీక్షించేలా చర్యలు చేపట్టారు.

జోన్-4లో శ్రీ‌వారి వాహ‌న సేవ‌ల‌లో ఉప‌యోగించిన వాహ‌నాలు, వాహ‌న‌సేవ‌లు, ప‌ల్ల‌కీలు, ఇత‌ర పూజ సామాగ్రిల  విశిష్ట‌త తెలుసుకునేలా ఏర్పాటు చేయ‌నున్నారు.

 జోన్‌-5లో శ్రీ‌వారికి ఉద‌యం సుప్ర‌భాతం నుండి రాత్రి ఏకాంత సేవ వ‌ర‌కు నిర్వ‌హించే సేవ‌లు,  నిత్య కైంక‌ర్యాలు

జోన్‌-6లో స‌ప్త‌గిరుల‌లోని తీర్థాలు – వాటి విశిష్ట‌త‌, ప్ర‌కృతి సౌద‌ర్యం – అందులోని అద్భుతాల‌ను తెలుసుకునేలా ఏర్పాట్లు చేప‌ట్ట‌ారు.

తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో సోమ‌వారం ఉద‌యం మ్యూజియం అభివృద్ధి ప‌నుల‌పై బెంగ‌ళూరుకు చెందిన మాప్ టెక్నాల‌జీస్ సంస్థ వారు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేషన్ ఇచ్చారు.

ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేషన్ అనంత‌రం ఈవో మాట్లాడుతూ జోన్‌ల వారిగా విభ‌జించిన ప‌నుల‌ను స‌కాలంలో పూర్తి చేయ‌డం ద్వారా ఏక్కువ మంది భ‌క్తులు మ్యూజియంను సంద‌ర్శించి, ఆధ్యాత్మిక ఆనందం పొందుతారాన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*