తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన శ్రీ వాణి ట్రస్ట్ అదరహో అనిపిస్తోంది ఈ ట్రస్టు ద్వారా దేవస్థానానికి కాసుల వర్షం కురుస్తోంది. శ్రీ వాణి ట్రస్ట్ విధానం సక్సెస్ కావడంతో టీటీడీ అధికారులు సంబరపడిపోతున్నారు. Po
శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం టిటిడి ప్రారంభించిన శ్రీవాణి ట్రస్టుకు దాతల నుండి విశేష ఆదరణ లభిస్తోందని టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవాణి ట్రస్టుకు విరాళం అందించిన 209 మంది దాతలు సోమవారం శ్రీవారి బ్రేక్ దర్శనం చేసుకున్నట్టు తెలిపారు.
మారుమూల ప్రాంతాలలో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్టు(శ్రీవాణి)ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది మే 25వ తేదీ నుండిఇప్పటివరకు ఈ ట్రస్టుకు రూ.3.21 కోట్లు దాతలు విరాళంగా అందించారన్నారు.
శ్రీవాణి ట్రస్టుకు విరాళాలందించే వారి కోసం శుక్రవారం 200, మిగతా రోజుల్లో 500 బ్రేక్ దర్శన టికెట్లు చొప్పున ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
నవంబరు 4 నుండి ఇప్పటి వరకు 1,961 మంది దాతలు విరాళాలు అందించారని తెలియజేశారు.
శ్రీవాణి ట్రస్టుకు విరాళాలందించిన వారిలో అమెరికా, జార్జియా, దుబాయి, సింగపూర్ తదితర దేశాలతోపాటు ఆంధ్రప్రదేశ్ నుండి 33 శాతం, తెలంగాణ 22 శాతం, తమిళనాడు 20 శాతం, కర్ణాటక 17 శాతం మంది దాతలు ఉన్నట్టు తెలిపారు.
Leave a Reply