శ్రీవారి ఆలయాన్ని నిరంతరాయంగా 13 గంటలపాటు మూసేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలోనూ ఆ సమయంలో గుడి తలుపులు తెరుచుకోవు. ఎందుకో తెలుసా?
తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని డిసెంబర్ 25 రాత్రి మూతపడ్డ గుడి డిసెంబరు 26 తేది మధ్యాహ్నం తెరుచుకుంటుంది. కారణం సూర్యగ్రహణం. డిసెంబరు 25, 26వ తేదీల్లో రెండు రోజుల్లో సూర్యగ్రహణం ఉంది.
25 నుంచి సూర్యగ్రహణ ప్రభావం పడుతుంది. డిసెంబరు 26న గురువారం నాడు ఉదయం 8.08 గంటల నుండి ఉదయం 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆరు గంటల ముందుగా అనగా డిసెంబరు 25న బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూస్తారు.
డిసెంబరు 26న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం తలుపులు తెరిచి ఆలయశుద్ధి అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. భక్తులు ఈ విషయాలను గమనించాలని కోరడమైనది. ఈ రోజుల్లో తిరుమల యాత్రకు సిద్ధమయ్యేవారు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది.
Leave a Reply