శ్రీవారి దర్శనానికి అదనపు కోటా… ఎప్పుడు? ఎవరికీ?

తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శించుకునే దివ్యాంగులు/వృద్దుల కోటా, చంటి బిడ్డల తల్లితండ్రులకు కోటాను రెండు రోజుల పాటు టీటీడీ అధికారులు పెంచారు.

సాధారనంగా తిరుమలలో దివ్యాంగులు/వృద్ధులు, చంటి బిడ్డల తల్లదండ్రులకు 1400 చొప్పున కోటా ఉండేది. ఈ మధ్య టీటీడీ ఓ ప్రకటన చేసింది. నెలలో రద్దీలేని సమయంలో 4 రోజులు ఈ కేటగిరి దర్శనాల కోటాను పెంచుతామని ప్రకటించింది. అందుకు అనుగుణంగానే శ్రీవారి దర్శనాల్లో కల్పించే అదనపు కోటా కింద ఈనెల 26న వృద్ధులు, దివ్యాంగులకు 4 వేల టోకెన్లు జారీచేయనున్నారు.

వీటిని ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉన్న కౌంటరులో ఉదయం 6గంటల నుంచి పొందవచ్చు. అలాగే 27న ఐదేళ్ల లోపు వరకూ/ చంటిబిడ్డ తల్లిదండ్రులను ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సుపథం మార్గంలో అనుమతిస్తారని టీటీడీ తెలిపింది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*