పెద్దశేష వాహనంపై పెరుమాళ్‌ అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై వైకుంఠ‌నాథ పెరుమాళ్‌ అలంకారంలో శంకుచ‌క్రాలు, గ‌దతో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.

అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

శ్రీ పద్మావతి అమ్మ‌వారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు.

అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది.

వాహనసేవలో పెద్దజీయ‌ర్‌స్వామి, చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి అదనపు సివిఎస్వో శివకుమార్‌రెడ్డి, విఎస్వో ప్ర‌భాక‌ర్‌, ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, పాంచ‌రాత్ర ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ గోపాల‌కృష్ణారెడ్డి, ఏవిఎస్వో, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ కోలా శ్రీ‌నివాసులు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*