భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బాబ్డే ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయనకు స్వాగతం పలికింది.
శనివారం సాయంత్రం తిరుమల చేరుకున్న ఆయన అదే రోజు శ్రీవారి సహస్రదీపాలంకార సేవలో పాల్గొన్నారు.
శనివారం రాత్రి తిరుమలలోని బసచేసిన ప్రధాన న్యాయమూర్తి ఆదివారం ఉదయం విరామ సమయంలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కార్యనిర్వాహక అధికారి అనిల్ కుమార్ సింఘాల్ ప్రధాన న్యాయమూర్తిని దగ్గరుండి తీసుకెళ్లి దర్శనం చేయించారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం కలిగించారు. స్వామివారి చిత్రపటం తీర్థప్రసాదాలను ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు.
Leave a Reply