నేడు తిరుచానూరులో ధ్వజారోహణం

తిరుచానూరులో వెలసిన పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం నుంచి ప్రారంభమవుతాయి. శుక్రవారం రాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. శనివారం ఉదయం నుంచి డిసెంబర్ 1 తేదీ వరకూ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.

కార్తీక మాసంలో తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అందుభాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రోజు ఉదయం 9 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ధర్వజారోహణం అంటే అమ్మవారికి అత్యంత ఇష్టమైన గజ పటాన్ని ధ్వజస్తంభంపైకి ఎగుర వేయడం. దీంతో అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమయ్యాయని భక్తులకు తెలుస్తుంది.

తరువాత మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల వరకూ అమ్మవారి ఉత్సవ మూర్తికి స్నపన తిరుమంజనం చేస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 6.30 గంటల వరకూ ఆస్థాన మండపంలో ఊంజల్ సేవ నిర్వహించనున్నారు. రాత్రి 7.30 గంటల నుంచి అమ్మవారి చిన్న శేష వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*