తిరుమలలో నీటికి వినియోగానికి ప్రత్యేక ఏర్పాట్లు… శుద్ధి కేంద్రాలు

తిరుమలకు అను నిత్యం కొన్ని వేల మంది భక్తులు తిరుమలకు చేరుతుంటారు. తిరుమలకు చేరుకునే వారు తిరుమల నుంచి తిరుగు ప్రయాణమయ్యేవారితో పోల్చుకుంటే కనీసం 1.5 లక్షల మంది జనాభా తిరుమలలో ఉంటారు. వీరి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం తాగునీటి ఏర్పాట్లు చేస్తోంది. తాగునీటి సమస్యను పరిష్కరించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటుంది.

భక్తులు రోజుకు 30 గ్యాలన్ల నీరు వినియోగిస్తుంటారు. అయితే ఆ నీరు వృధా పోకుండా పర్యావరణాన్ని కాపాడుతూనే నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసింది. 80 శాతం నీటిని రకరకాలుగా వినియోగించుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. కొండపై నీటి వనరులూ అంతంత మాత్రంగానే ఉంటాయి. శ్రీవారి మెట్టు సమీపంలో ఉన్న కళ్యాణీ డ్యాం ప్రముఖమైనది కాగా, తిరుమలలోని కొన్ని డ్యాములు నీటిని అందిస్తున్నాయి. అయితే అవి పూర్తిగా సరిపోవు.

అదే విధంగా వినియోగించిన నీటిని బయటకు వదిలితే పర్యావరణం పాడయ్యే అవకాశం ఉంది. అదే నీరు దిగువన తిరుపతికి చేరినా అదే పరిస్థితి. దీంతో శుద్ధికేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అటు పర్యావరణాన్ని ఏర్పాటు చేసినట్లువుతుంది. అదే విధంగా నీటి సమస్య ముప్పును తప్పించినట్లవుతుందని టీటీడీ ఈ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకు 4 కేంద్రాలు ఏర్పాటు చేసింది. తొలుత 1994లో 3ఎంఎల్‌డీ సామర్థ్యం గల శుద్ది కేంద్రాన్ని నిర్మించింది. వీటి ద్వారా శుభ్రపరిచిన నీటిని మొక్కల పెంపకానికి వినియోగిస్తున్నారు.

అన్నమయ్యభవన్‌కు సమీపంలో నూతనంగా నీటి శుద్ధి కేంద్రాన్నినిర్మించారు. అలాే మరో కేంద్రం ఏర్పాటుకు చర్యలు ప్రారంబించారు. అదే సమయంలో చాలా చోట్ల నీటి వినియోగం అధికంగా ఉంటుంది. మొక్కలకు వినియోగిస్తూనే మరోవైపు మరుగుదొడ్లకు కూడా వినియోగించాలనే ఆలోచనలో ఉన్నారు. మరుగుదొడ్లకు పెద్ద ఎత్తున నీరు అవసరముంటుంది. కాబట్టి ఈ విధంగా శుద్ధి చేసిన నీటిని సద్వినియోగంలోకి తెస్తున్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*