తిరుమలలో పెళ్ళి చేసుకోవాలంటే…రూల్స్ మారాయి తెలుసా..?

తిరుమలలో పెళ్ళి చేసుకోవాలనుకునే వారికి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చేశాయి. నిబంధనల మేరకు దృవీకరణ పత్రాలను తీసుకురావాల్సి ఉంటుంది. ఏమిటా దృవీకరణ పత్రాలు ఏమా కథ?

తిరుమలలో పెళ్ళి చేసుకోవడానికి చాలా మంది ఉత్సాహం చూపుతుంటారు. అక్కడ పెళ్ళి చేసుకుంటే జీవితం సాఫీగా ప్రశాంతంగా సాగిపోతుందని భావించే వారున్నారు. అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారు కూడా తక్కువ ఖర్చుతో ఇక్కడే వివాహం చేసుకుంటుంటారు. టీటీడీ కొత్త నిబంధన తీసుకువచ్చింది.

తిరుమలలో ప్రత్యేకించి తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణవేదికను ఏర్పాటు చేసింది. ఆర్థిక భారం ఉన్న వారికి చాలా తక్కువ ఖర్చుతో టీటీడీ ఇక్కడ వివాహం చేసుకోవడానికి సౌకర్యాలు ఏర్పాటు చేసింది. ఇంతవరకూ వధువు, వరుడు పుట్టిన తేదీలు, విద్యార్హత పత్రాలు, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, శుభలేఖ, లగ్నపత్రికను సమర్పించాల్సి ఉంటుంది. వధువు, వరుడు తల్లిదండ్రులు తప్పనిసరిగా వివాహానికి హాజరు కావాలి. ఒకవేళ ఎవరైనా మరణించి ఉంటే వారి డెత్ సర్టిఫికేట్ జత చేస్తేనే ఆ దరఖాస్తును పరిశీలిస్తారు. మైనారిటీ తీరిన వారికి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశం కల్పించే వారు. శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలనుకునేవారికి తిరుమలలోని కల్యాణవేదికలో టీటీడీనే ఉచితంగా వివాహాలు జరిపిస్తోంది.

అయితే ఇటీవల నిబంధనలలో మార్పులు చేసింది. టీటీడీ ద్వారా పెళ్లి చేసుకోవాలంటే ఇకపై తప్పనిసరిగా వివాహం కాలేదంటూ ధృవీకరణ సర్టిఫికేట్ ఉండాల్సిందే. ఈ మేరకు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. కొందరు భార్య, లేఖ భర్త విడిపోయి తిరుమలలో రెండో వివాహం చేసుకోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి.

దీంతో ఇతర పత్రాలతోపాటు అన్ మ్యారీడ్ సర్టిఫికేట్ కూడా జత చేయాలని టీటీడీ అధికారులు నిబంధన విధించారు. ఎవరైనా ఆ సర్టిఫికేట్ తీసుకురాకపోతే వరుడు, వధువు వయస్సు 25ఏళ్ల లోపు ఉన్న టీటీడీ ఉద్యోగుల్లో ఎవరైనా తెలిసినవారు ఉంటే వారితో లేఖ రాయించుకుని పెళ్లికి అనుమతి ఇస్తున్నారు. వయస్సు అధికంగా ఉన్నవారిని మాత్రం తిరస్కరిస్తున్నారు. వధువు, వరుడు తమ ప్రాంతంలో తాహసీల్దార్ నుంచి కనీసం విఆర్వో, గ్రామ సెక్రటరీ నుంచి సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. ఇంత వరకూ కల్యాణవేదికలో జరిగే వివాహ వేడుకను వీడియో రికార్డు చేసుకునేందుకు అదనపు లైట్ల అమరికకు వీలుండేది. అయితే కొన్ని సాంకేతిక కారణాలవల్ల ఆ సదుపాయాన్ని టీటీడీ నిషేధించింది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*