ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే… ఫలితమేంటి?

ఉత్పన్న ఏకాదశి రోజున  ఉపవాసం ఉంటే  ఏం ఫలితం కలుగుతుంది?  అసలు ఈ ఉత్పన్న ఏకాదశి అంటే ఏమిటి?  ఈరోజు నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లాల్సిందే.

మన పురాణాలలో  ప్రతిదానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. కార్తీక పౌర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఉత్పన్న ఏకాదశి అంటే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు.

శ్రీమహావిష్ణువు యొక్క  శక్తి స్వరూపాలు  తెలిపే  ఏకాదశులలో  ప్రత్యేకమైంది  ఉత్పన్న ఏకాదశి.

శ్రీమహా విష్ణువు ముర అనే రాక్షసుడిని  సంహరించడానికి సిద్ధమైన సందర్భంగా  ఆయనలోని ఒక శక్తి ఆ పని పూర్తి చేసింది అంటే ముర సంహరించింది. అప్పుడు విష్ణువు సంతోసించి ఆమెకు ఏకాదశి అని నామధేయం చేశాడు.

  శక్తి ఉత్పన్నమైన రోజు కావున దానికి శ్రీ మహావిష్ణువు పేరు పెట్టిన రోజు కావున ఉత్పన్న ఏకాదశి అని అన్నారు. ఈ ఏకాదశిని ఏకాదశి తిధి జయంతిగా భావిస్తారు.

ముర అంటే తామసిక, రాజసిక, అరిషడ్వర్గాలకు ప్రతీక. ఈరోజు ఉపవాసం తప్పనిసరిగా చేయవలెను. ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపములు హరించబడతాయి.

ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించిన వారి ఆ మురను జయించి మిగతా 23 ఏకాదశులలో ఉపవాసం చేసిన ఫలితం కలిగి వైకుంఠప్రాప్తి పొందగలరు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*