మీరిచ్చే చీరె పద్మావతి అమ్మవారికి అలంకరిస్తారు తెలుసా…!

పద్మావతి అమ్మవారు మనం ఇచ్చే చీరలను స్వీకరిస్తారు. ఇది మీకు తెలుసా ! అర్చకులు కూడా అదే చీరలను అమ్మవారికి అలంకరింప చేస్తారు. ఇది ఆషామాషీ చెప్పే మాట కాదు. నిజం అందుకు టీటీడీ ఆహ్వానం పలుకుతోంది. ఇది తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే.

కార్తీక మాసం అంటే  పద్మావతి అమ్మవారికి ఎనలేని ఇష్టం. ఆ నెలలో భక్తులను అలరింప చేస్తుంటారు. భక్తులు ఇచ్చే చీరలను స్వీకరిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని  పద్మావతి అమ్మవారి ఆలయానికి  నిధుల కొరతై కాదు.

కార్తీక మాసంలో జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే ఇలా భక్తులు తీసుకువచ్చే చీరలను అమ్మవారి అలంకరణ చేయడం ఆనవాయితీ. కాకపోతే బహూకరించే చీరలకు కొన్ని నిబంధనలు ఉంటాయి.

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని న‌వంబ‌రు 23 నుండి డిసెంబ‌రు 1వ తేదీ వ‌ర‌కు భక్తుల నుంచి ప‌ట్టువస్త్రాల‌ను బహుమానంగా స్వీకరిస్తామని టిటిడి తెలిపింది. భ‌క్తులు స‌మ‌ర్పించే ఈ వ‌స్త్రాల‌ను అమ్మవారి మూలమూర్తికి అలంకరిస్తారు. భ‌క్తులు ఉద‌యం 10 గంట‌ల‌ నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆల‌యం లోప‌ల సూప‌రింటెండెంట్‌ను క‌లిసి వ‌స్త్రాల‌ను అంద‌జేయ‌వ‌చ్చునని టిటిడి ప్రకటించింది.

పద్మావతి అమ్మవారి మూలమూర్తికి అలంకరించేందుకు 9 ఇంచులు, ఆపైన గల జరీ అంచు కలిగిన నాణ్యమైన పట్టుచీరలను మాత్రమే స్వీకరిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని తెలియజేసింది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*