తిరుచానూరులో ప్రారంభమైన లక్షకుంకుమార్చన

తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి లక్షకుంకుమార్చన ప్రారంభమయ్యింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

కార్తీక మాసం సందర్భంగా తిరుచానూరులో 23 నుంచి పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగునున్నాయి. ఇందుల భాగంగా మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమం నిర్వహించారు.

శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి వేదపండితులు అమ్మవారికి లక్షకుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వేదపండితులు కుంకుతో అర్చన చేస్తున్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గోని తిలకిస్తున్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*