తిరుమలలో లడ్డూ సంచులు.. బాక్సుల ధరలు తెలుసా?

తిరుమల పుణ్యక్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చడానికి తిరుమల తిరుపతి దేవస్థానం కంకణ కట్టుకుంది. అత్యధికంగా వినియోగంలో ఉన్న లడ్డూ కవర్లను నిర్మూలించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా రక రకాల ప్రత్యామ్నాయ మార్గాలను అమలులోకి తెచ్చింది. సంచులను లడ్డూ బాక్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది.

తిరుమలలో ప్రతి రోజు లక్షల లడ్డూ ప్రసాదాన్ని భక్తులు తీసుకెళ్ళుతుంటారు. ఇందులో భాగంగా వారు ప్లాస్టిక్ కవర్లను వినియోగించేవారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల ఓ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా లడ్డూలను తీసుకెళ్ళడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతికింది. బాక్సులను, సంచులలో లడ్డూలను ఇవ్వాలని నిర్ణయించింది.

ప్రతి భక్తుడు ఒక లడ్డూనైనా తీసుకువెళ్ళతారు. సరాసరిన 80 వేల మంది భక్తులు దర్శనానికి వస్తారు. వీరికే కాక, అదనపు లడ్డూలను తీసుకువెళ్లుతుంటారు. మొత్తంపై ఒక్క లడ్డూలకే కనీసం లక్ష కవర్లు తిరుమలలో వినియోగంలో ఉండేవి. వీటిని పూర్తిగా నిలిపి వేయడానికి టీటీడీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే బాక్సలను, ప్లాస్టిక్ రహిత సంచులను అందుబాటులోకి తీసుకువచ్చింది.

వివిధ రకాల బాక్సులను రూపొందించింది. వాటి ధర మూడు రూపాయలు మొదలు పది రూపాయల వరకూ అందుబాటులో ఉన్నాయి. ఐదు లడ్డూలకు మించిన తీసుకెళ్ళేవాళ్ళు సంచులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క సంచి 25 నుంచి లడ్డూలు పట్టే పరిమాణాన్ని బట్టి రూ. 25 నుంచి రూ. 55 వరకూ వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*