గుడికి ఎందుకు వెళ్ళాలి? గుడిలో నిజంగా అద్భుతాలు ఉంటాయా ?

హిందువులుగా ఉన్న వారిలో చాలా మందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. దానిని మనకు మన పెద్దలు నేర్పితే, మనం మన పిల్లలకు నేర్పుతాం. ఇందులోని మర్మమేటో తెలియకుండా మనం పెద్దలు చెప్పిన ప్రకారం గుడికి వెళ్ళి పూజలు చేస్తుంటాం.

పెద్దలు ఎంతో అనుభవంతో మనకు నేర్పిన సలక్షణం గుడికి వెళ్ళడం. అయితే అందులో మర్మమేమిటో తెలుసుకుంటే మరింత బాగుంటుంది. గుడికి వెళ్ళితే నిజంగా మనకు అంతటి ప్రేరణ ప్రశాంతత వస్తుందా? ఒక్కసారి చూద్దాం.

గుడని దర్శించుకోవడం వెనుక ప్రయోజనాలే ఉన్నాయని చెబుతారు. నేటి సైన్సు, నాటి వేదాలు రెండూ చెప్పే మాటే. అయితే ఈ అంశం కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో నిర్మించిన ఆలయాలకు ఎక్కువగా వర్తిస్తుంది. ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలాగే భూమిలో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తూ ఉంటుంది. అది కూడా భూమి స్వభావం.

ఆ ప్రాంతంలో ఉండే ఖనిజాలు, లోహాలను అనుసరించి ఉంటుంది. అందుకే ఆలయం నిర్మించడానికి అప్పట్లో కొన్ని ప్రత్యేక ప్రదేశాలను మాత్రమే ఎన్నుకుంటారు. ఆ గుళ్లలోకి వెళ్లగానే శరీరం ఒక్కసారిగా చల్లబడుతుంది, మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఇది కావాలంటే పరిశీలించి చూడడండి.

ఎంపికైన ప్రదేశంలో దేవాలయం, ఆకర్షణ శక్తి అధికంగా ఉన్న కేంద్రంలో మూలవిరాట్టును ప్రతిష్టింప చేస్తారు. వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు)ను విగ్రహం కింద నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది.

అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూలవిరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ప్రతి రోజు గుడికి వెళ్ళేవారిలో దివ్యశక్తి చేరడాన్ని మనం గమనించవచ్చు. గుడి వెళ్ళి వచ్చేవారు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది.

అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే. ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు మరింత శక్తిని సమకూరుస్తాయి.

 

టెంకాయలు ఎందుకు కొడతారు.? పూజలు ఎందుకు చేస్తారు? కర్పూరం ఎందుకు వెలిగిస్తారు? దీపం ఎందుకు వపెట్టాలి వంటి అంశాలను మరో సందర్భంలో తెలుసుకుందాం. 

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*