భారతదేశ తత్వమే వేద ధర్మం మీద నిలబడి ఉంది

– గోవర్థన పీఠం పీఠాధిపతి

భారతదేశ తత్వమే వేదధర్మంపై నిలబడి ఉందని ఒరిస్సాలోని గోవర్థన పీఠం పీఠాధిపతి హెచ్ హెచ్ శ్రీనిశ్చలానందం స్వామి వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఎస్వీ ఉన్నత వేద విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులను ఉద్దేశించి ఆయన తిరుమలలోని ఆస్థానమండపంలో బుధవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్వ మానవుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వేదాలను విస్తరింప చేయడంలోనూ, వాటిని రక్షించడంలో వేదాల పట్ల చైతన్యం కల్గించడంలో ప్రుముఖ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

వేదాలలోని సారాంశాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి పాటుపడాలని కోరారు. అది ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపపీఠాధిపతి నిరూపానంద సరస్వతి స్వామీజి, డిప్యూటీ ఈవో బాలాజీ, ఎస్వీహెచ్ ఎస్ ప్రాజెక్టు అధికారి ఏ. విభీషణ శర్మ, ధర్మగిరి వేదపాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*