తిరుమల ప్రొటోకాల్ దర్శనం ఎలా? ఇందులో హారతి ఇస్తారా?

తిరుమలలో గుడిలోనే హారతీ తీసుకోవాలంటే ఏం చేయాలి? అసలు అక్కడ హారతి ఇస్తారా? శఠారీ పెడతారా? కాసేపు నిలబడాలంటే ఏ దర్శన కోటాలో వెళ్ళాలి ? ఇలాంటి అంశాలు చాలా మందికి తెలియదు. గుడిలోనే హారతి తీసుకునే అవకాశం ఉంది. అయితే దీనికంతటికి పెద్ద పలుకుబడే ఉండాలి.

తిరుమలలో ఉదయం దర్శనాలు ప్రత్యేకంగా విఐపీల కోసమే కేటాయిస్తారు. ఆ దర్శనాలపై విమర్శలు వచ్చినప్పుడు పేర్లు మార్చి రకరకాల పేర్లతో చెబుతుంటారు. కానీ, ఉదయం జరిగే దర్శనాలు కేవలం విఐపీల కోసమేననే విషయం టీటీడీ ఎరిగిన సత్యం. బ్రేక్ దర్శనంలో ఎల్1, ఎల్2, ఎల్ 3 దర్శనాలు ఉండేవి.

ఇందులో అధికారులు, ప్రముఖులను ముందుగా పంపేవారు. వారికి ఎల్ 1, ఆ తరువాత ఎల్ 2లో కొంచెం తక్కువ ప్రాధాన్యత ఉన్నవారు, తరువాత ఎల్ 3లో సాధారణ ప్రాధ్యనత ఉన్నవారిని దర్శనానికి పంపేవారు. ‘ పురుషలందు పుణ్యపురుషులు వేరయా… ’ అన్నచందంగా విఐపీలందూ వివిఐపీలు వేరయ్యా అన్న విధంగా ఇక్కడ వారిని కూడా వేరుపరుస్తారు.

అయితే ఈ విధానంపై విమర్శలు రావడంతో విఐపీలు అందరూ సమానమే అని ఒక ప్రకటన చేశారు. అయినంత మాత్రనా అందరూ ఒకటే అనుకుంటే పొరబాటు. వారిని కూడా కంపార్టుమెంట్లవారిగా విభజిస్తున్నారు. జడ్డీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బోర్డు సభ్యులు, ఇతర ఉన్నత స్థాయి అధికారులను వేరుపరుస్తారు. వారికి ఒక సమయాన్ని కేటాయిస్తారు. వారికి ముందుగా దర్శనం కల్పిస్తారు. దీనినే టీటీడీ సంకేత బాషలో ప్రొటోకాల్ దర్శనం అంటారు.

ఈ దర్శనంలో వెళ్ళే ప్రముఖలు, వారి వెంట వెళ్ళే వారికి గుడి లోపల అన్ని రకాల ఏర్పాట్లు ఉంటాయి. వీరి వెంట ఒక అటెండర్‌ను కూడా పంపుతారు. లోనికి రాగానే ధ్వజస్తంభానికి దండం పెట్టుకునేందుకు అనుమతిస్తారు. ఒక్కొక్క విఐపి వెంట వచ్చిన వారిని మాత్రమే గుడిలో కూడా కులశేఖర పడి అంటే, గర్బగుడి సమీపానికి తీసుకెళ్ళతారు.

అక్కడ కొద్దిసేపు నిలబెట్టి దర్శనభాగ్యం కల్గిస్తారు. ఆ తరువాత హారతి ఇస్తారు. అక్కడే శఠారి పెట్టి తరువాత తెరవేస్తారు. అక్కడే టీటీడీ ఉన్నత స్థాయి అధికారి ఉంమీ ఇవన్నీ చూసుకుంటారు.

ఆ తరువాత మరో విఐపి, వెంట వచ్చిన వారిని తీసుకెళ్ళి అదే విధంగా దర్శన భాగ్యం కల్గిస్తారు. ఆ తరువాత వారిని మండపంలోకి తీసుకెళ్ళి వేద మంత్రోచ్ఛరణల మధ్య వేదపండితులతో ఆశీర్వచనం ఇప్పిస్తారు. మరీ ముఖ్యమైన విఐపీ అయితే ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని ఇచ్చి శాలువ కప్పి బయటకు పంపుతారు. అలాంటి విఐపీల వెంట పోతే, అద్బుత దర్శన భాగ్యం లభిస్తుందన్నమాట.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*