డిసెంబర్1న పంచమి తీర్థం సందర్భంగా..
తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన డిసెంబరు 1న పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను తిరుచానూరు పద్మావతి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారెను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా డిసెంబరు 1న ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె గజాలపై ఊరేగింపుగా మొదలై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా బేడి ఆంజనేయస్వామివారి ఆలయంకు చేరుకుంటుంది.
తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్దకు చేరుకున్న సారెకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడినుంచి భజనలు, కోలాటాలు తదితర కళాబృందాల నడుమ కోమలమ్మ సత్రం (ఆర్ఎస్గార్డెన్), తిరుపతి పురవీధుల గుండా తిరుచానూరు పసుపు మండపానికి ఉదయం 9.00 గంటలకు సారె చేరుకుంటుంది.
అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకస్వాములు, అధికార గణంతో కలిసి ఊరేగింపుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పుష్కరిణి వద్దకు సారెను తీసుకువెళ్లతారు.
Leave a Reply