లడ్డు పెట్టెలను అమలులోకి తెచ్చిన టిటిడి
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంలో తిరుమల పట్టణం లో ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకు రావడానికి నడుంబిగించింది.
అంచలంచలుగా ప్లాస్టిక్ పై నిషేధాన్ని విధిస్తూ అత్యధికంగా లడ్డూల కోసం వినియోగించే ప్లాస్టిక్ సంచులపై పూర్తి స్థాయిలో నిషేధాన్ని అమలులోకి తెచ్చింది. ప్రత్యామ్నాయంగా అట్ట పెట్టాను అందుబాటులోకి తీసుకువచ్చింది.
2 లడ్డు, రెండు లడ్డులు, 5 లడ్డులు, 10 లడ్డూలు అమర్చ కలిగే పెట్టెల అమ్మకానికి పెట్టింది. ఇకపై ఎక్కడ కూడా తిరుమలను ప్లాస్టిక్‌ను వినియోగించరాదని ఆదేశాలు కూడా జారీ చేసింది. చివరకు తిరుమల ఆలయం లోకి తీసుకెళ్లి వస్తువు కూడా ప్లాస్టిక్ రహిత సంచులు లోనే తీసుకెళ్లాలని ఆంక్షలు విధించింది.
మరోవైపు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ళను నిషేధించడం లో భాగంగా భక్తులు అత్యధికంగా ఉన్న ప్రదేశాలలో కూడా వాటర్ కూలర్లను ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతుంది.
Om namo venkatesaya