తిరుమలలో శ్రీరంగం ఆశ్రమం పీఠాధిపతి వ‌రాహ‌ మహాదేశికన్‌

తమిళనాడులోని శ్రీరంగం శ్రీమద్‌ ఆండవన్‌ ఆశ్రమం పీఠాధిపతి వ‌రాహ‌ మహాదేశికన్ (ఆండవన్‌) స్వామీజీకి టిటిడి శ్రీవారి ఆలయం తరపున సోమ‌వారం ఉదయం పెద్ద మర్యాద చేశారు.

ముందుగా పాత అన్నదాన భవనం వద్ద గల రావిచెట్టు వద్దకు స్వామీజీ చేరుకున్నారు. టిటిడి అర్చకస్వాములు, అధికారులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికి బేడి ఆంజనేయస్వామివారి దర్శనం చేయించారు. అక్కడ శఠారి సమర్పించి మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయం  వ‌ద్ద‌కు చేరుకున్నారు.

శ్రీవారి ఆలయం వద్ద స్వామీజీకి టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందచేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, విజివో మ‌నోహ‌ర్‌, పేష్కార్‌ లోక‌నాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*