తిరుమలలో చంటిపిల్లలతో వెంకన్న దర్శనం ఎలా?

తిరుమలకు చంటి పిల్లలతో వస్తున్నారా? రద్దీలో పిల్లలను తీసుకుని స్వామిని ఎలా దర్శనం చేసుకోవాలి అని ఆందోళన చెందుతున్నారా? మీరు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టిటిడి ప్రవేశపెట్టిన దర్శనాలపై కాస్తంత దృష్టి పెడితే చాలు మీకు సులువుగా స్వామి దర్శనం కలుగుతుంది అది ఎలాగంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.

తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వేల మంది భక్తులు క్యూ కడుతుంటారు. పిల్లలు పుట్టగానే తొలిసారి తలనీలాలు తిరుమలలో శ్రీవారికి సమర్పిస్తామని స్వామికి మొక్కుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి దర్శనం ఎలాగా? అని ఆందోళన చెందుతుంటారు. కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం చంటి పిల్లలను కలిగిన తల్లిదండ్రులకు ఓ ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేసింది. రోజులో ఉదయం 11 నుంచి సాయంత్రం 5గంటల వరకు చంటి పిల్లల తల్లిదండ్రులకు ఈ అవకాశం కల్పిస్తారు

మరి మీరు ఎక్కడికి రావాలి?

చంటి పిల్లలను కలిగిన తల్లిదండ్రులు తిరుమల చేరుకున్న తరువాత ఆలయానికి దక్షిణభాగంలో ఉన్న సుపథం ప్రవేశ మార్గానికి చేరుకోవాలి. మీ ఆథార్ కార్డును చూపాలి. తనిఖీలు పూర్తయిన, అన్ని పరిశీలించిన అనంతరం మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారు గంట రెండు గంటలలో దర్శనం పూర్తి చేసుకుని బయటకు రావచ్చు

ఏ వయసు పిల్లల వరకు అనుమతిస్తారు?

చంటిపిల్లలు అంటే కేవలం 12 నెలలు వయస్సులోపల ఉన్న వారికి మాత్రమే అన్న విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఈ దర్శన విధానంలో అనుమతి ఉంటుంది. చిన్న పిల్లలు కదా వారికి అవసరమైన అన్న పానీయాలు ఎలా అనే అనుమానం చాలా మందిలో కలుగుతుంది. పిల్లలకు, చంటి పిల్లల తల్లులకు పాలు సరఫరా చేస్తారు. వేచి ఉండాల్సిన పరిస్థితులలో అన్న పానీయాలను ఏర్పాటు చేస్తారు. ఈ మధ్య కాలంలో అయిదు సంవత్సరాల లోపల ఉన్న పిల్లల తల్లిదండ్రులను కూడా నెలకు రెండు మార్లు దర్శనానికి అనుమతిస్తున్నారు అయితే ఆ తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటిస్తుంది దానిని అనుసరించి మనం దర్శనానికి రావాల్సి ఉంటుంది

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*