బెంగళూరు సలహా కమిటీ సమావేశంలో టీటీడీ చైర్మన్ వైవీ
గోవింద నామం నలుదశలా వ్యాప్తి చేసేందుకు దేశ వ్యాప్తంగా ఏర్పాటైన స్థానిక సలహా కమిటీలు పనిచేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు.
శనివారం బెంగళూరులో టీటీడీ స్థానిక సలహా కమిటీ తొలి సమావేశం మాజీ ఎంపీ కుపేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుబ్బారెడ్డి మాట్లాడుతూ కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ చేరవేసేందుకు కమిటీలు చిత్తశుద్ధితో కృషి చేయాలని అభిలషించారు.
టీటీడీ దేవస్థానాల్లో ఆగమోక్తంగా కైంకర్యాలు, ఉత్సవాలు జరిగేట్లు కమిటీ పర్యవేక్షించాలన్నారు. భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించేట్లు కార్యక్రమాల రూపొందించాలని సూచించారు. ప్రత్యేకంగా ఉత్సవాలకు సంబంధించి చేపట్టే కార్యక్రమాలకు టీటీడీ అనుమతి తీసుకోవాలని కోరారు.
ఆలయాల నిర్వహణలో లోపాలుంటే వెంటనే గుర్తించి టీటీడీ సహకారంతో సవరించాలన్నారు. సలహా కమిటీ సభ్యులు స్వతంత్రంగా ధన, వస్తు కానులు తీసుకోరాదని చెప్పారు. ఆలయ విధి విధానాల్లో కమిటీ సభ్యులు జోక్యం చేసుకోవద్దన్నారు. టీటీడీ ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా స్థానిక సలహా కమిటీలు వ్యవహరించాలని కోరారు. సమావేశంలో స్థానిక సలహా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Leave a Reply