తిరుమలలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ 

తిరుమల వేంకటేశ్వరస్వామివారి దర్శనార్ధం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ శ‌నివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు.  రామ మందిరం పై తీర్పు వెలువడిన తర్వాత ఈ నెలలో ఆయన పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే.

ఆదివారం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

పద్మావతి అథిది గృహల వద్ద ఆయనకు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, రిసెప్షన్ అధికారి శ్రీ బాలాజి, ఇత‌ర ఉన్నాతాధికారులు ఘన స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు.

శ‌నివారం తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ దర్శించుకున్నారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్ రంజన్ గొగోయ్‌కు టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్ కుమార్‌, అర్చ‌కులు ఇస్తిక‌ఫాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

ద‌ర్శ‌నానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*