దేశ అత్యున్న న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ తిరుమల స్వామివారిలో ఓ సామాన్య భక్తుడిగా మారిపోయాడు. స్వామివారి వాహనసేవలో పాల్గొని… బయటకు వచ్చిన తరువాత ఏనుగుతో ఆశీర్వాదం తీసుకుని వేంకటేశ్వరునిపై తనకున్న భక్తిని చాటుకున్నారు. శనివారం సాయంత్రం తిరుమల చేరుకున్న గగోయ్ తిరుమలలో జరిగిన వివిధసేవలలో పాల్గొన్నారు.
రామజన్మభూమిపై తీర్పు వెలువరించిన కొద్ది రోజులకే ఆయన తిరుమలకు చేరుకున్నారు. తన పదవీ కాలం ముగుస్తున్న సమయంలో తిరుమలకు రావడం విశేషం. సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటే రాష్ట్రపతి, ప్రధాన మంత్రులకు ఇచ్చే తరహాలోనే ఇక్కడ ఏర్పాట్లు, స్వాగతాలు ఉంటాయి. అయితే రంజన్ గగోయ్ తిరుమలలో ఓ సామన్య భక్తుడిలా వ్యవహరించారు. అక్కడ జరుగుతున్న సహస్రదీపాలంకరణ సేవలు నేలపై కూర్చుని స్వామి సేవను తిలకించారు.
ఆ తరువాత స్వామి వాహనసేవలో పాల్గొన్నారు. ఆ తరువాత మాడ వీధిలోని ఏనుగుల దగ్గరకు వెళ్ళి ఓ సాధరణ వ్యక్తిలా గజరాజు ఆశీర్వచనం తీసుకోవడం విశేషం. ఏ స్థాయి న్యాయమూర్తి అయినా తిరుమల వెంకన్న ముందు ఓ సామాన్య భక్తుడనేననే సంకేతాన్ని ఆయన జనానికి ఇచ్చారు.
Leave a Reply