అమ్మవారి బ్రహ్మోత్సవాలు అద్భుతంగా ఉండాలి.

-టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

తిరుచానూరు పద్మావతి అమ్మవారికీ నిర్వహించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. శుక్రవారం ఉదయం తిరుపతి పద్మావతి అతిధి గృహంలో జేఈవో బసంత్ కుమార్ సుబ్బారెడ్డితో భేటీ అయ్యారు.

ఈ సందర్బంగా వైవీ మాట్లాడుతూ 23 నుంచి డిసెంబర్ 1 దాకా నిర్వహించే బ్రహ్మోత్సవాలలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ప్రత్యేకించి గరుడసేవ, స్వర్ణరథం, గజావాహన సేవ, పంచమతీర్థం నిర్వహించే రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని బసంత్ కుమార్ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయా రోజుల్లో భద్రతా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని వైవీ సూచించారు.

భక్తులందరికీ అమ్మవారి మూల మూర్తి దర్శనం కల్పించడంతోపాటు పంచమి తీర్థంనాడు అందరికీ ప్రసాదాలు అందేట్లు కృషి చేయాలని అధికారులకు సుబ్బారెడ్డి కోరారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*