తిరుమల దర్శనానికి వృద్ధులు వస్తున్నారా? అయితే ఇలా?

తిరుమల దర్శనం అంటేనే కిలోమీటర్లు తిరుమల క్షేత్రంలోనే తిరగాల్సి ఉంటుంది. ఇలాంటి చోటుకి వృద్ధులైన తల్లిదండ్రులను అత్తమామలను, అవ్వతాతలను తీసుకెళ్ళాలంటే ఎంతో రిస్కుతో కూడుకున్న పని అని ఒకటి రెండు మార్లు ఆలోచించాల్సి ఉంటుంది. అందులో తప్పులేదు. కానీ, ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే అదంత పెద్ద కష్టమేమి కాదు. వృద్ధుల దర్శనం మీకు భారమే కాదు. అన్నీ సవ్యంగా జరిగిపోతాయి. అదేలా అంటారా? అయితే ఈ వార్తను మీరే చూడండి

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళాలంటేనే క్యూలైన్లలో తోపులాటలు, రద్దీ, నడక అమ్మో భయమేస్తుంది. వృద్ధులతో వెళ్లితే ఎక్కడ సాధ్యమవుతుంది. ఇది ఒక స్థాయి వరకూ నిజమే. కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మీరు చేయవలసిందల్లా ఒకే ఒక్కటి మీ వెంట వచ్చే వృద్ధుల ఆధార్ కార్డును తీసుకెళ్లడమే. వారి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్ల చేసింది.

65 యేళ్ళ వయస్సుపై(ధృవీకరణ పత్రంతో వెళ్లాలి)నున్న వారికి మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ అవకాశం కల్పించింది. కేవలం గంటలోపు దర్శనం చేసుకుని వారు బయటకు వచ్చేస్తారు. దేవస్థానం వృద్ధలు వికాలంగుల కోసం ప్రత్యేకంగా కొన్ని టికెట్లను జారీ చేస్తుంది. వాటిని రెండు గంటల ముందు నుంచి ఇస్తారు. రోజుకు కేవలం 1400 టికెట్లు మాత్రమే ఇస్తారు. ఈ మధ్యలో నెలకు రెండు రోజులపాటు అదనపు సమయాన్ని కేటాయించారు. వీటికోసం క్యూ కాంప్లెక్సు సమీపంలోని మ్యూజియం వద్ద ఏర్పాటు చేసిన కౌంటరుకు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ టికెట్టు తీసుకుంటే ఇక అంతా టీటీడీనే చూసుకుంటుంది.

వారి వెంట 12 యేళ్ళ లోపు ఉన్న పిల్లలను మాత్రమే అనుమతిస్తారు. పెద్దలను ఎవరిని అనుమతించారు. ఒక వేళ పిల్లలు లేకపోతే, టీటీడీనే వారి బాధ్యతలను చూసుకుంటుంది. టికెట్టు జారీ చేసే కౌంటరు నుంచి ఎలక్ట్రిక్ వాహనాలలో తీసుకెళ్ళి నిర్దేశిత ప్రాంతం నుంచి గుడిలోకి అనుమతించి దర్శనం భాగ్యం కలిగిస్తారు. తిరిగి వారిని కౌంటర్ వద్దకు చేర్చుతారు. ఇక వారు వేచి ఉన్నంత సేపు అక్కడే అన్న పానీయాలను ఏర్పాటు చేస్తారు.

దర్శనం దొరుకుతోందని వారు ఈ కోటాలో రోజు వచ్చి కూర్చుంటే కుదరదు. ఒక్కసారి దర్శనం చేసుకుంటే మరో మూడు నెలల వరకూ అనుమతించరు. సాధారణంగా ఉదయం 9-10 గంటలకు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వీరిని దర్శనానికి వదులుతుంటారు. అయితే ఈ వేళలు కాస్త అటుఇటుగా మారుతంటాయి. వాటిని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆపై మనం వారిని తీసుకుని నేరుగా వసతి గృహాలకు చేరుకోవచ్చు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*