కపిలేశ్వరస్వామివారి ఆల‌యంలో రుద్ర‌యాగం

Poతిరుపతిలోని కపిలతీర్థం ఆలయంలో క‌పిలేశ్వ‌ర‌స్వామివారి హోమం (రుద్ర‌యాగం) గురువారం ప్రారంభ‌మైంది. నెల రోజుల పాటు జరుగనున్న హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 14 నుంచి 24వ తేదీ వ‌రకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వ‌హిస్తారు.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ‌, రుద్ర‌జ‌పం, హోమం, ల‌ఘు పూర్ణాహుతి, నివేద‌న, హార‌తి నిర్వహించారు. సాయంత్రం పూజ‌, జ‌పం, హోమం, రుద్ర‌త్రిశ‌తి, బిల్వార్చ‌న‌, నివేద‌న‌, విశేష‌దీపారాధ‌న, హార‌తి ఇస్తారు.

గృహస్తులు రూ.500/- టికెట్‌ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*