తిరుమల వెంకన్న ఎండకు ఎండి, వానకు తడిచాడా?

స్వామి అలా ఎప్పుడు? ఎందుకు?

వేంకటేశ్వర స్వామి ఒంటి మీద కిలోల కొద్ది బంగారు. దేదీప్యమానం వెలుగిపోయే దివ్య తేజస్సు. కనీసం సూర్యకిరణం కూడా సోకలేని ప్రదేశం, వాన తుంపర్లు కూడా పడని ప్రదేశంలో ఉండే స్వామి నెలవై ఉన్నాడు. ఇలాంటి ఆయన ఎండకు ఎండి వానకు తడిచాడా? కనీస గోపురం కూడా లేని రోజులు ఉన్నాయా? తెలుసుకోవాలని ఉందా ? అయితే ఈ వార్త చదవాల్సిందే.

కలియుగదైవం వేంకటేశ్వర స్వామి అంటే భోగభాగ్యాలతో తులతూగే దేవుడని అంటారు. ప్రపంచలోనే ఇంతటి వైభవం మరే దేవుడికి లేదని హిందువులు మొత్తం నమ్ముతారు. ఆయన దర్శనం రెప్పపాటు దొరికితే చాలని అనుకుంటారు. రోజుల తరబడి వేచి ఉండడానికి భక్తులు సిద్ధమవుతారు.

ఆయన ఆశీస్సుల కోసం మోకాళ్ళ కొండలెక్కి వస్తారు. ఆయన మహత్యంలో నేటికీ నాటికీ ఏమాత్రం తేడా లేకపోయినా… ఒకప్పుడు ఈ స్థాయిలో గోపురాలు, దూపదీపనైవేద్యాలు లేవనే తెలుస్తోంది.

తిరుమల ఆలయం చరిత్ర తెలిపేటటువంటి 12కు పైగా పురాణాలు ఉన్నాయని చాలా మంది చరిత్రకారులు రచయితలు, పరిశోధకులు చెబుతున్నారు. ప్రధానంగా తిరుమలపై ఎక్కువగా తమిళంలోనే సాహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడు రెండు గోపురాలు,  మూడు ప్రాకారాలతో ఆలయం వెలసిల్లుతోంది. ఏడువాకిళ్ళ ఆవలి స్వామి కొలువై ఉన్నాడు.

అయితే ఒకప్పుడు కనీసం ఒక్క వాకిలి కూడా లేని స్థితి అంటే నమ్ముతారా? కానీ, తమిళ సాహిత్యంలోకి తొంగి చూస్తే ఇదే నిజమని తెలుస్తోంది తిరుమల కొండపై ఓ మహిమ గలిగిన దేవుడు ఉన్నాడని ఆయన రోజు సూర్య,చంద్రులను చూస్తాడని రాసి ఉంది.

చరిత్రకారులు, రచయిత అంచనాల ప్రకారం తిరుమలలో వెలసిన దేవుడు కేవలం నాలుగు స్థంభాల రాత్రి పందిరి కింద ఉండేవాడని తెలుస్తోంది. చుట్టూ గోడలు కూడా లేని స్థితిలో ఆలయం ఉండేదని అంటున్నారు. ఈ స్థితిలో ఆయన సూర్యచంద్రులను రోజు చూసి ఉంటారని అంటారు.

అంటే స్వామి ఏదోక సమయంలో ఎండకు ఎండారు. అలాగే వానకు తడిచారని అర్థమవుతోంది. అలాగే కొందరు వ్యక్తులు మాత్రమే స్వామిని దర్శించుకుని అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయే వారిని, పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఉన్నంతగా దీపదూపనైవేద్యాలు ఉండేవి కావని తెలుస్తోంది. 

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*