17న తిరుమలలో కార్తీక వన భోజన మహోత్సవం

ఆర్జిత సేవలు రద్దు

          పవిత్ర కార్తీకమాసంలో నవంబరు 17వ తేదీ ఆదివారం తిరుమలలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని తిరుమలలోని పార్వేట మండపంలో టిటీడీ నిర్వహించ‌నున్నది. 

         ఈ కార్తీక వనభోజన మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీమలయప్ప స్వామివారిని బంగారుతిరుచ్చిపై, దేవేరులను మరో పల్లకిపై అందంగా అలంకరించి కూర్చుండబెట్టి వాహనమండపానికి ఊరేగింపుగా తీసుకు వెళతారు.

ఉదయం 8.30 గంటలకు సమర్పణ అనంతరం మలయప్పస్వామి వారిని ఒక చిన్న గజవాహనంపై వాహనమండపం నుండి పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకువెళతారు.

అదే విధంగా మరో పల్లకిపై ఉభయ నాంచారులను రంగనాయక మండపం నుండి పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకువెళతారు. కార్తీక వనభోజన మహోత్సవం నేపథ్యంలో ఇక్కడ శ్రీ భూదేవి, శ్రీ దేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు.

        ఈ వన భోజన మహోత్సవాన్ని తాళ్ళపాక అన్నమాచార్యులవారి పెద్ద కుమారుడైన పెద తిరుమలాచార్యుల వారు 16వ శతాబ్దంలో నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే ఏ కారణాల వల్లనో ఈ కార్తీక వనభోజనోత్సవం ఆగిపోయింది. 
             
      ఈ ఉత్సవాన్ని టిటిడి 2010వ సంవత్సరం నుండి పునరుద్ధరించింది. ఈ మేరకు కార్తీక వనభోజనోత్సవం ఈ ఏడాది నవంబరు 25వ తేదిన పార్వేట మండపంలో మధ్యాహ్నం 1.00 నుండి 2.00 గంటల నడుమ ఘనంగా జరుగుతుంది.
        
      ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగు ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*