నాగలాపురం ఆలయ పవిత్రోత్సవాల పోస్టర్ విడుదల

నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల గోడ‌ప‌త్రిక‌ల‌ను జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ శుక్ర‌వారం తిరుపతిలో ఆవిష్క‌రించారు.

    ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలిసి తెలియక దోషాలు జరుగుతుంటాయి. దోషాలను పరిహారంగా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

     న‌వంబ‌రు 22న సాయంత్రం సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. న‌వంబ‌రు 23న ఉదయం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, సాయంత్రం వీధి ఉత్సవం, రాత్రి పూర్ణాహుతి నిర్వ‌హిస్తారు.

   పోస్టర్ విడుదల కార్య‌క్ర‌మంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప్ర‌త్యేక ఆహ్వానితులు శ్రీ గోవింద హ‌రి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, డిఈవో డా. ర‌మ‌ణ‌ప్ర‌సాద్‌, సూప‌రింటెండెంట్ శ్రీ చంద్ర‌మౌళీశ్వ‌ర‌శ‌ర్మ‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.
మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*