దివ్యాంగులు, వృద్ధులకు ప్రతి నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం

తిరుమల తిరుపతి దేవస్థానం వృద్ధుల పైన దివ్యాంగుల పైన ప్రత్యేక శ్రద్ధ వహించింది. స్వామిని దర్శనం చేసుకోవడానికి ఇప్పటికే వారి కోసం కొంత సమయం కేటాయించింది. ప్రతి నెలా రెండు రోజులు ప్రత్యేక ప్రవేశ దర్శనం కేటాయించింది

తిరుపతి దేవస్థానం అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతినెలా రెండు సామాన్య దినాల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. ఈనెల కోటా కింద న‌వంబ‌రు 12, 26న వృద్ధులు, దివ్యాంగులకు, న‌వంబ‌రు 13, 27వ తేదీల్లో చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

     శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టిటిడి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది.

       ఇందులోభాగంగా న‌వంబ‌రు 12, 26వ తేదీల్లో మంగ‌ళ‌వారం వయోవృద్ధులు(65 సం. పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

     ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ  1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం 7 గంటల నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారు.

కావున భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తరువాత ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు.

      5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను న‌వంబ‌రు 13, 27వ‌ తేదీల్లో బుధ‌వారం ఉద‌యం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.

సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*