జీవ‌న‌ప్ర‌గ‌తి సాధ‌నకే మెట్లోత్స‌వం

శ్రీవారి మెట్లోత్సవంలో సుబుదేంద్ర‌తీర్థ స్వామీజీ

   ధ‌ర్మ‌మార్గంలో న‌డుస్తూ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ భ‌గ‌వంతుడిని చేరుకోవ‌డ‌మే మెట్లోత్స‌వం అంత‌రార్థ‌మ‌ని మంత్రాల‌యం రాఘ‌వేంద్ర‌స్వామి మ‌ఠాధిప‌తి సుబుదేంద్ర‌తీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు.

టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం గురువారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. సుబుదేంద్ర‌తీర్థ స్వామీజీ, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పి.ఆర్‌.ఆనంద తీర్థాచార్య ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు.

    ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ప్ర‌తి ఒక్క‌రూ త‌మ రంగాల్లో వృద్ధి చెందుతూ ఉన్న‌తికి చేరుకోవాల‌న్నారు. శ‌క్తివంచ‌న లేకుండా భ‌క్తితో ప్ర‌య‌త్నిస్తే భ‌గ‌వంతుని అనుగ్ర‌హం త‌ప్ప‌క క‌లుగుతుంద‌న్నారు. బ్రహ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. 

    దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్టు చెప్పారు.

     అంతకుముందు భజనమండళ్ల భక్తులు టిటిడి మూడో సత్రం ప్రాంగణం నుండి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. 

అనంతరం పాదాలమండపం వద్ద సంప్రదాయ బద్ధంగా మెట్లపూజ నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 2500 మందికిపైగా భక్తులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*