తిరుమల: మరో వారం రోజుల్లో శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా నియమిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి e వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్టు ఆగమ సలహా మండలి సభ్యులు రమణ దీక్షితులు తెలిపారు .
బుధవారం సాయంత్రం తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో ఆనాది కాలంగా నాలుగు కుటుంభాల అర్చకులు తరిస్తూ వచ్చారని అయితే వారిని మత ప్రభుత్వం అర్ధంతరంగా తీసి వేసిందనే ఆవేదన వ్యక్తం చేశారు
ముస్లిం, బ్రిటిష్ కాలంలో కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా పూజా కైంకర్యాలను ఈ కుటుంబాలు మాత్రమే నిరంతరంగా నిరంతరంగా నిర్వహించాయని చెప్పారు.
1987 వంశపార్యపరంగా వస్తూన్న హక్కులును రద్దు చెయ్యడంతో ఎన్నో దేవాలయాలు మూతపడ్డాయని అన్నారు.
తరువాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి 2007లో చట్ట సవరణ చేస్తూ మార్పులు తీసుకు వచ్చి ఆలయాలు పున:రుద్దరణకు చర్యలు తీసుకున్నారని చెప్పారు
గత ప్రభుత్వం ఆగమశాస్ర్తం లో లేని విధంగా అర్చకులుకు రిటైర్మెంట్ అమలు చేసారు. రిటైర్మెంట్ నిభందనను తోలగిస్తామని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో హమి ఇచ్చారని వివరించారు.
సియం హమీ మేరకు తనకు ఆగమ సలహా మండలి సభ్యుడిగా నియ మించారు అని వారం రోజుల్లో ప్రధాన అర్చకులు పదవిని ఇస్తామని హమిని ఇచ్చినట్లు చెప్పారు
Leave a Reply