తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకుడు గా పనిచేసిన రమణదీక్షితులు కు తిరిగి ఆలయ ప్రవేశానికి తిరుమల తిరుపతి దేవస్థానం స్థానం కల్పించింది. మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది
తిరుమల ఆలయంలో వంశ పారంపర్యంగా ఆయన అర్చకులు గా పనిచేస్తున్నారు. తిరుమల ప్రాశస్త్యం పెరిగిపోవడంతో ఐఏఎస్ అధికారులు ఆలయంపై పెత్తనం మొదలుపెట్టారు. ఎప్పటి నుంచో ఆలయ కైంకర్యాల విషయంలో అధికారుల జోక్యాన్ని రమణదీక్షితులు వ్యతిరేకిస్తూనే వచ్చారు.
తమకు కంటిలో నలుసులా తయారయ్యారు అన్న ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో తిరుమల జేఈఓ గా పనిచేసిన శ్రీనివాసరాజు పనిగట్టుకొని రమణ దీక్షితులకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి సాగనంపారు. అప్పటి నుంచే రమణదీక్షితులు తిరుమల తిరుపతి దేవస్థానం పై పోరాటం సాగిస్తూనే ఉన్నారు.
ఇదే క్రమంలో అప్పటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి రమణ దీక్షితులు కు హామీ ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే రమణదీక్షితులు తిరిగి అర్చక విధుల్లోకి తీసుకుంటారని అందరూ భావించారు.
ఇదిలా ఉండగా రమణ దీక్షితులు కు తిరుమల తిరుపతి దేవస్థానానికి మధ్యన న్యాయస్థానంలో కొన్ని వ్యాజ్యాలు నడుస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన నేరుగా ప్రధాన అర్చకులుగా తీసుకోలేదు. కానీ ప్రస్తుతం అర్చకులుగా పనిచేస్తున్న వారికి మార్గదర్శిగా విధులు నిర్వహించే విధంగా ఆగమ సలహా మండలిలో సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాబట్టి ఇ రమణదీక్షితులు నేరుగానే ఆలయంలోకి ప్రవేశించి కైంకర్యాలు నిర్వహించే అవకాశం లభించినట్లయింది. కోర్టు కేసుల పరిష్కారం అయిన తర్వాత తిరిగి ప్రధాన అర్చకులుగా నియమిస్తారని అభిప్రాయం కూడా వినిపిస్తోంది

Leave a Reply