మఠాధిపతి మాట : హరినామస్మరణతోనే మోక్షరం

మెట్లోత్సవంలో విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ

కలియుగంలో మోక్ష సాధనకు యజ్ఞాలు, యాగాలు, తపస్సు చేయనవసరం లేదని, హరినామస్మరణ చేస్తే చాలని క‌ర్ణాట‌క‌లోని కొక్కె సుబ్రహ్మణ్య మఠాధిపతి విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవ కార్యక్రమాలు మంగ‌ళ‌వారం  తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనక వైపు ఉన్న మూడో సత్రం ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

       ఈ సందర్భంగా విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు చేస్తూ శ్రీవేంకటేశ్వరుడు శ్రీ వైకుంఠం నుండి తిరుమలపై కాలుమోపి సకల జీవరాశులను రక్షిస్తున్నారని అన్నారు. ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలో మెట్లోత్సవం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో చెడు విషయాలపై దృష్టి పెట్టకుండా భగవన్నామస్మరణ చేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. కొక్కె సుబ్రహ్మణ్య క్షేత్రంలో సాక్షాత్తు ఆదిశేషుడే కొలువయ్యారని, ఇక్కడ స్వామివారిని దర్శిస్తే కష్టాలు తొలగిపోతాయన్నారు.

    ఎందరో మహర్షులు, రాజర్షులు, శ్రీ పురందరదాసులు, శ్రీవ్యాసరాజయతీశ్వరులు శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణ దేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి మరింత పవిత్రమయం చేశారని చెప్పారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వివరించారు. ఇలా కాలినడకన వెళ్లి సప్తగిరీశుని దర్శిస్తే వారికి సకల అరిష్టాలు తొలగిపోయి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాల‌ నుండి 2 వేల‌ మందికిపైగా భజనమండళ్ల సభ్యులు పాల్గొనడం సంతోషకరమన్నారు.

      టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జ‌రిగింది.
     

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*