తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో తిరుమంజన కార్యక్రమం నిర్వహించింది.
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పుష్పయాగాన్ని నిర్వహించనున్నారు. అందులో భాగంగా టీటీడీ అధికారులు పుష్పాలను తీసుకువచ్చి స్వామి సమర్పించారు. సాయంత్రం పుష్పయాగం జరుగనున్నది.
దానికి ముందుగా సోమవారం శ్రీవారి ఆలయంలో గర్భగుడి వెనుక ఉన్న కళ్యాణమండపంలో శ్రీవారు, శ్రీదేవి, భూదేవిల ఉత్సవ మూర్తులను ఏర్పాటు చేసి స్నపన తిరుమంజనం చేశారు. అందులో భాగంగా చందనం, పసుపు, పాలు, పెరుగు, నెయ్యి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి సింఘాల్ అదనపు ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply