కపిల తీర్థంలో లో నవగ్రహ హోమం

         తిరుపతిలోని కపిల తీర్థము వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమ మహోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.
నెలరోజులపాటు జరిగే ఈ మహోత్సవాలలో నవగ్రహ హోమం జరుగింది.

         ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి 12 గంటల వరకు నవగ్రహహోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, నవగ్రహ కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ ద‌క్షిణామూర్తి స్వామివారి కలశస్థాపన, విశేష దీపారాధన చేపట్టనున్నారు.

న‌వంబ‌రు 4న‌ శ్రీ ద‌క్షిణామూర్తి హోమం

          న‌వంబ‌రు 4వ తేదీ సోమ‌వారం శ్రీ ద‌క్షిణామూర్తి హోమం జ‌రుగ‌నుంది. గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.

         ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*